Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుసీలేరులో ఏపీ జెన్‌కో ఉద్యోగి ఆత్మహత్య

సీలేరులో ఏపీ జెన్‌కో ఉద్యోగి ఆత్మహత్య

గూడెం కొత్త వీధి, పెన్ పవర్ మే 23:గూడెం కొత్తవీధి మండలం సీలేరు ప్రాంతంలో ఏపీ జెన్‌కో ఉద్యోగి దార సింహాచల పాత్రో అలియాస్ ధారబాబు (57) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత 28 ఏళ్లుగా జెన్‌కో సివిల్ విభాగంలో పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం రెగ్యులేటర్ డ్యాం వద్ద ఫోర్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.శనివారం ఉదయం బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి ఇంటికి వచ్చిన అనంతరం వంటగదిలో చీరతో ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లికి తరలించారు. గత కొంతకాలంగా ధారబాబు మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సహచర ఉద్యోగులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular