Homeఆంధ్రప్రదేశ్1/70 చట్ట పరిరక్షణకు దుచ్చరపాలెం గ్రామస్తుల ‘లక్ష’ విరాళం

1/70 చట్ట పరిరక్షణకు దుచ్చరపాలెం గ్రామస్తుల ‘లక్ష’ విరాళం

గిరిజన హక్కుల కోసం ఏకతాటిపై గ్రామం 

ఉద్యమానికి ఆర్థిక అండగా ప్రజల స్వచ్ఛంద సహకారం

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 11: గిరిజన ప్రాంతాల భూములు, హక్కులను కాపాడే చారిత్రాత్మక 1/70 భూ బదలాయింపు నిరోధక చట్టం పరిరక్షణ కోసం దుచ్చరపాలెం గ్రామస్తులు విశేష ఐకమత్యాన్ని చాటారు. చట్టాన్ని రక్షించుకోవడం ప్రతి గిరిజనుడి బాధ్యత అనే సంకల్పంతో గ్రామంలోని ఆదివాసీలు, యువత, పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) విరాళాన్ని సేకరించి అందజేయడానికి సిద్ధమయ్యారు.ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించే 1/70 చట్టంపై ఇటీవలి కాలంలో జరుగుతున్న వివిధ ప్రచారాలు, పరిణామాల నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చట్ట పరిరక్షణ కోసం అవసరమైన న్యాయపోరాటాలు, ప్రజా ఉద్యమాలకు తమ వంతు మద్దతు అందించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.గ్రామంలోని ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా స్పందించి, తమకు తోచిన మేర విరాళాలు అందించడంతో కొద్ది రోజుల్లోనే లక్ష రూపాయలు సమీకరించారు. ఈ నిధిని గ్రామ పెద్దల సమక్షంలో 1/70 చట్ట పరిరక్షణ కమిటీ ప్రతినిధులకు అందజేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.హక్కుల పరిరక్షణ కోసం ఆర్థికంగా కూడా ముందుకు వచ్చిన దుచ్చరపాలెం గ్రామస్తుల చొరవను పలువురు గిరిజన నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు అభినందించారు.ఈ స్ఫూర్తిదాయక నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. “చట్టాల పరిరక్షణతోనే గిరిజనుల మనుగడ, భూముల భద్రత సాధ్యమవుతుంది. భవిష్యత్తులో కూడా గిరిజన హక్కుల కోసం జరిగే ప్రతి ప్రజాస్వామ్య పోరాటానికి మేము అండగా ఉంటాం” అని గ్రామస్తులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద సాగిన రామరాజు పడాల్, మాజీ సర్పంచ్ సాగిన పుష్పకుమారి, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు సాగిన భీమేశ్వర్ పడాల్, లక్ష్మణ్ బ్రదర్స్, కృష్ణ పడాల్, బ్రహ్మాజీ, గోపి, సోమరాజు, గుమ్మల రాంబాబు, వార్డు సభ్యుడు జోగి పడాల్తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular