Homeఆంధ్రప్రదేశ్చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...

చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

చిలకలూరిపేట , పెన్ పవర్, జూలై 11 :

చిలకలూరిపేట:  పసుమర్తి వద్ద శనివారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది.హైదరాబాద్ నుంచి వస్తున్న కారును ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జయింది.హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో వస్తున్న కారు,పసుమర్తి వద్దకు రాగానే ప్రమాదం బారిన పడింది.ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి కారును బలంగా ఢీకొట్టడంతో, కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగాఉలిక్కిపడ్డారు.

క్షేమంగా బయటపడిన ప్రయాణికులు..

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై, కారులో చిక్కుకున్న నలుగురు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు.వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.వైద్యుల సమాచారం మేరకు, బాధితులకు స్వల్ప గాయాలయ్యాయని, వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.

పోలీసుల దర్యాప్తు..

సమాచారం అందుకున్న చిలకలూరిపేట పోలీసులుహుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారును రోడ్డు పక్కకు తొలగించి,ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగం కారణమా లేక డ్రైవర్ నిర్లక్ష్యమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular