ప్రదేశాల్లో మద్యపానం, గంజా సేవనంపై చింతూరు పోలీసుల కఠిన హెచ్చరిక
చింతూరు, పెన్ పవర్, మే 29,
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేయడం, గంజా సేవించడం వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చింతూరు పోలీసులు హెచ్చరించారు. చింతూరు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ల ద్వారా పూర్తిస్థాయి పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేయకుండా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు బహిరంగ మద్యపానానికి సంబంధించి 28 పెట్టి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఇకపై ఎవరైనా గంజా సేవిస్తున్నట్లు అనుమానం వచ్చినట్లయితే గంజాయి టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చింతూరు ఎస్ఐ హెచ్చరించారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణానికి సహకరించాలని కోరారు.

