ePaper
Sunday, May 31, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంగంజాయి త్రాగితే జైలుకే ...

గంజాయి త్రాగితే జైలుకే …

📰 Generate e-Paper Clip

అడ్డతీగల, మే 30: శనివారం అడ్డతీగల సర్కిల్ కార్యాలయంలో అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. గజేంద్ర కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంజాయి త్రాగే వారిని అదుపు చేసే కొత్త పద్ధతి ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అనుసరిస్తున్నారని సిఐ తెలిపారు. బయో చెక్ అనే రాపిడ్ కిట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆరు నెలల క్రితం గంజాయి త్రాగిన వ్యక్తిని కూడా గుర్తించొచ్చు అని ఈ కిట్టులో సదరు వ్యక్తి మూత్రము ఒక చుక్క వేసినట్లయితే అతను గంజాయి త్రాగే వ్యక్తి అయితే వెంటనే పాజిటివ్ వస్తుందని, గంజాయి అలవాటు లేని వ్యక్తికి నెగిటివ్ వస్తుందని గంజాయి కి ఇక ఎవరు అలవాటు పడకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే వినూత్న ప్రయత్నమని, ఈ రాపిడ్ టెస్ట్ ద్వారాపాజిటివ్ వచ్చిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అనంతరం వారికి ఎవరు సరఫరా చేస్తున్నారు అన్నదానిపై ఆరా తీయడం జరుగుతుందని, ఆ వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని సీఐ గజేంద్ర తెలిపారు. గంజాయి కి కొత్తగా అలవాటు పడిన వారు ఎవరైనా ఉంటే వారికి గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని , జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిందని , అనుమానితులను ప్రతి ఒక్కరికి ఈ టెస్ట్ చేయడం జరుగుతుందని సిఐ గజేంద్ర తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular