ePaper
Saturday, June 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంగోవిందగిరి ఆలయానికి చేరిన తిరుమల లడ్డూ ప్రసాదం

గోవిందగిరి ఆలయానికి చేరిన తిరుమల లడ్డూ ప్రసాదం

📰 Generate e-Paper Clip

రంపచోడవరం, పెన్ పవర్, జూన్ 13: తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోవింద గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కు తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం చేరుకుంది. రెండవ శనివారం సందర్భంగా ఆలయానికి చేరిన ఈ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని తిరుమల లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలని ఆలయ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అంచూరి శిరీష కోరారు. తిరుమల శ్రీవారి ప్రసాదం అందుబాటులో ఉండటంతో పరిసర ప్రాంతాల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular