గార్ల, పెన్ పవర్, జూలై 28:
అర్హత ఉన్న ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షురాలు భూక్య స్వాతి నాయక్ అన్నారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు నక్క శివకృష్ణ తో కలిసి మండలంలో 24 గంటల పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎస్ ఐ ఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి, నమోదును మరింత వేగవంతం చేయడం, ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 179 182 183 193 194 196 197 198 199 202 203 204 పోలింగ్ బూత్లను సందర్శించి, శక్తి కేంద్ర ఇన్చార్జిలతో పాటుగా ఆయా బూత్ లెవెల్ అధికారులను కలిసి ఇప్పటివరకు జరిగిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పురోగతి, నమోదైన శాతం, ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూప్రత్యేక ఓటరు జాబితా సవరణ రాజకీయ కార్యక్రమం కాదని, ఎన్నికల సంఘం చేపట్టిన ప్రజాస్వామ్య ప్రక్రియ అని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవాభావంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ కార్యకర్తలు గుగులోతు దేవా, వెంగలి బుచ్చిబాబు, బిజెపి పార్టీ ఇల్లందు అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు, ప్రధాన కార్యదర్శి గోన సాయికృష్ణ, శక్తి కేంద్ర ఇన్చార్జి వీరస్వామి, బూత్ అధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, లక్ష్మయ్య, వాసు, రాంబాబు, సోను, మాధవరావు, రాము, సుమలత, తదితరులు పాల్గొన్నారు.

