Homeఆంధ్రప్రదేశ్పోలవరంగంగవరం మండలంలో జాతీయ రహదారిపై సైడ్ రైలింగ్స్ ఏర్పాటు చేయాలి

గంగవరం మండలంలో జాతీయ రహదారిపై సైడ్ రైలింగ్స్ ఏర్పాటు చేయాలి

 

జనసేన అధ్యక్షుడు సిద్దు డిమాండ్

గంగవరం, పెన్ పవర్ జూలై 28: గంగవరం మండల కేంద్రం నుంచి వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా సైడ్ రైలింగ్స్ ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ గంగవరం మండలాధ్యక్షుడు కుంజం సిద్దు ప్రభుత్వాన్ని, జాతీయ రహదారి అధికారులను కోరారు.జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామాల వద్ద రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు రోడ్డుకు ఇరువైపులా సైడ్ రైలింగ్స్ ఏర్పాటు చేయడంతో పాటు బస్ స్టాప్‌లు, రోడ్డు క్రాసింగ్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
అదేవిధంగా జాతీయ రహదారి పరిధిలోని గ్రామాల్లో హైవే లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో వాహనదారులు, పాదచారులకు భద్రత కల్పించాలని కోరారు. ఇటీవల మండల పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని అని అన్నారు .ఈ అంశంపై జాతీయ రహదారి అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని కుంజం సిద్దు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular