ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంఅసోసియేషన్ ఎన్నికలకు అనుమతి కోరిన రెవెన్యూ ఉద్యోగులు

అసోసియేషన్ ఎన్నికలకు అనుమతి కోరిన రెవెన్యూ ఉద్యోగులు

📰 Generate e-Paper Clip

 

రంపచోడవరం, పెన్ పవర్, జూన్ 16: పోలవరం జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా, డివిజన్, కలెక్టరేట్ కమిటీల ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని హడాక్ కమిటీ చైర్మన్ ఎస్.కె. ఫయాజ్ భాష (జిలాని) నేతృత్వంలోని ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 20న నిర్వహించనున్న రెవెన్యూ డే కార్యక్రమానికి సహకారం అందించాలని కూడా కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని, అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని కలెక్టర్ సూచించినట్లు జిలాని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular