Homeఆంధ్రప్రదేశ్పోలవరంపోలవరం జిల్లాలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి : జేసీ ప్రశాంత్ కుమార్

పోలవరం జిల్లాలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి : జేసీ ప్రశాంత్ కుమార్

📰 Generate e-Paper Clip

 

రంపచోడవరం, జూన్ 28: పోలవరం జిల్లాలోని ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ తల్లిదండ్రులను కోరారు. ఆదివారం రంపచోడవరం ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

జిల్లాలో 651 పోలియో బూత్‌లు, 47 మొబైల్ టీమ్‌లు, 22 ప్రత్యేక మొబైల్ టీమ్‌ల ద్వారా 28,265 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని జేసీ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular