బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు.
ముంచంగిపుట్టు,పెన్ పవర్,జూలై 01:ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర జన్మదినాని పురస్కరించుకొని ముంచంగిపుట్టు మండల కేంద్రంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి జడ్పీ చైర్ పర్సన్ చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు. ఆమె ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పద్మా రావు, జగబందు, మూర్తి సుబ్బలక్ష్మి, ముఖీ రాంప్రసాద్, సన్యాసిరావు అప్పారావు, పాపారావు, రమేష్, బాబురావు, దామోదరం, అర్జున్, బుద్ధా, కోడా సాధురం, మోనేశ్వరరావు, రామకృష్ణ, లోకినాధ్, భగీరధి, రామకృష్ణ, రాందాస్, లోబ్బో, రాంబాబు, సింహాచలం, బాలరాం తదితరులు పాల్గొన్నారు.

