గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగష్టు 15:మండలంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మోహిని జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది, చిన్నారులు తదితరులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.
ఐసీడీఎస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES

