గార్ల ,పెన్ పవర్, ఆగస్టు 18:
అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం పాపన్న సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షులు తోడేటి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.తెలంగాణ బహుజన వీరుడు, పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతిని పురస్కరించుకొని గార్ల కల్లుగీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ కూడలిలో గల అమరవీరుల స్తూపం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తాళ్లపల్లి కృష్ణ గౌడ్ తో పాటుగా మూడుసార్లు వార్డ్ మెంబర్ గా గెలిచిన తోడేటి శ్రీనివాస్ ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ తరఫున నిరంతరం పోరాడుతున్న కందునూరి శ్రీనివాస్ విదేశీ యానం ముగించుకుని స్వదేశానికి వచ్చిన విజయ రాముడు లను శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. అనంతరం గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ సామన్య కుటుంబం నుంచి ఎదిగిన సర్వాయి పాపన్న ప్రజలను ఏకం చేసి అప్పటి ఆధిపత్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. ప్రజల హక్కులు, గౌరవం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.పాపన్న పోరాటం కేవలం అధికార సాధనకే పరిమితం కాకుండా సామాజిక అసమానతలు, దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగి ప్రజల కోసం పోరాడవచ్చని తన జీవితంతో నిరూపించారని అన్నారు.పాపన్న చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, ఐక్యతా స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నేడు ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గౌడ సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోత్ హాథిరాం నాయక్ తోడేటి విజయ రాముడు గౌడ్ మండ రవి గౌడ్ కందునూరి శ్రీనివాస్ గౌడ్ కోల కుమార్ గౌడ్ మోత్కూరి వెంకట్రాజ్యం గౌడ్ కొత్తకొండ కుమార్ గౌడ్ మోత్కూరి సమ్మయ్య గౌడ్ కత్తి వెంకన్న గౌడ్ కత్తి శివ గౌడ్ తోడేటి నాగరాజుగౌడ్ నాగేశ్వరరావు గౌడ్ మోత్కూరి రమేష్ గౌడ్ గాజుల కృష్ణ గౌడ్ గాజుల ఐలయ్య గౌడ్ గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

