Homeఆంధ్రప్రదేశ్పోలవరంబొడ్డగండిలో జూలై 3న ‘నెలకు ఒక గ్రామం’ కార్యక్రమం

బొడ్డగండిలో జూలై 3న ‘నెలకు ఒక గ్రామం’ కార్యక్రమం

 

రంపచోడవరం, జూలై 2: గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామంలో జూలై 3న ఉదయం 10:30 గంటలకు “నెలకు ఒక గ్రామం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. “నెలకు ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వివిధ శాఖల సమస్యలను పరిశీలించి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. గుర్తేడు మండలం మరియు పరిసర గ్రామాల ప్రజలు ఆధార్ పత్రాలతో హాజరై తమ సమస్యలను తెలియజేసి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular