రంపచోడవరం, జూలై 2: గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామంలో జూలై 3న ఉదయం 10:30 గంటలకు “నెలకు ఒక గ్రామం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. “నెలకు ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వివిధ శాఖల సమస్యలను పరిశీలించి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. గుర్తేడు మండలం మరియు పరిసర గ్రామాల ప్రజలు ఆధార్ పత్రాలతో హాజరై తమ సమస్యలను తెలియజేసి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

