Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంఅందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి: పేడాడ రమణికుమారి

అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి: పేడాడ రమణికుమారి

కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: పేడాడ రమణికుమారి

విశాఖపట్నం, (పెన్ పవర్ ): విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని మాధవధార 50వ వార్డులో ఆలయ ధర్మకర్త, తెలుగుదేశం పార్టీ 51వ వార్డు అధ్యక్షుడు సనపల కీర్తి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పండుగ మహోత్సవాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణికుమారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.

ఈ మహోత్సవంలో ఖారవేల ఎడ్యుకేషనల్, కల్చరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ (విశాఖపట్నం జిల్లా కళింగ సంఘం) అధ్యక్షుడు పేడాడ నర్సింగరావు, తెలుగుదేశం పార్టీ 50వ వార్డు అధ్యక్షుడు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సనపల వరప్రసాద్, కింజరాపు అనిత రాణి, 51వ వార్డు బీజేపీ అధ్యక్షురాలు తమ్మినేని పద్మజ, సనపల నరేందర్, నంబాల ఈశ్వరరావు, ఉపేంద్ర, కె.వి. రాజు, రమణ, లలిత, దవల కుమారి, లలితా కుమారి, కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular