ఖమ్మం, పెన్ పవర్, జూలై 22:
పేపర్ లీకేజీలపై ఢిల్లీలో చేపట్టిన నిరసన సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తో పాటు పలువురు ఎంపీలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖమ్మం రూరల్ పెద్ద తండా పరిధిలోని రామ్ లీలా ఫంక్షన్ హాల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఇది నిదర్శనం అన్నారు. చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై బాష్పవాయువు ప్రయోగించి లాఠీఛార్జి చేయడం అమానుషమన్నారు. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలపై పార్లమెంట్లో చర్చించాలని ప్రతిపక్షాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. యువతపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లాఠీఛార్జికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ భూక్య ఫుల్ చంద్, కాంగ్రెస్ నాయకులు అంబాల వెంకటేశ్వర్లు, కిషన్ నాయక్, సుమన్ నాయక్, భూక్య సురేష్ నాయక్, కడప నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

