Homeతెలంగాణహనుమకొండప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సహజం

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సహజం

గార్ల, పెన్ పవర్, జులై 21:

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిఒక్కరికి బదిలీ సహజమని, విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ వి.స్వాతి అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మెడికల్ సూపరిండెంట్ గా విధులు నిర్వర్తించి రీ డిప్లమెంటులో బదిలీపై ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం గ్రామానికి వెళ్తున్న డాక్టర్ కుర్ర కొప్పుల శ్రీధర్ గౌడ్ కు వీడ్కోలు పలుకుతూ మంగళవారం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించి సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్ గౌడ్ వృత్తినే దైవంగా భావిస్తూ ఉద్యోగ విధి నిర్వహణలో అంకిత భావంతో నిబద్ధతతో తమ వృత్తిని సజావుగా కొనసాగిస్తూ అందరి మన్ననలను పొందాడని ఆయన సేవలను వారు కొనియాడారు గత రెండు సంవత్సరాలుగా పనిచేసిన కాలంలో సహకరించిన సీనియర్ డాక్టర్ వి.హనుమంతరావు, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్, పారామెడికల్ సిబ్బంది, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ శానిటేషన్ సిబ్బందికి డాక్టర్ శ్రీధర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ రాణి, వైద్య సిబ్బంది ఆశాలత, ఉపేందర్ రజిని, వెంకటరమణ, స్వాతి, సరిత, పారామెడికల్ సిబ్బంది తిరుమల రావు, అశోక్, మాధవి, స్వరూప, మల్లికాంబ పర్వీన్ షకీరా శానిటేషన్ సిబ్బంది దేవరాజ్, ఎల్లయ్య, సింధు, ఉపేందర్, చిన్ని, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular