గార్ల, పెన్ పవర్, జూలై 21:
రాజ్యసభ సభ్యులు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళవారం గార్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, తోలుత గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు, అనంతరం ఈ సందర్భంగా గార్ల మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు గంగావత్ రామ్ సింగ్ నాయక్ గార్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ భానోత్ పార్వతి హతీరం నాయక్ లు మాట్లాడుతూ దేశంలో బిజెపి సృష్టిస్తున్న అరాచకాలను ఎండగడుతూ ప్రజాసేవ పరమావధిగా తన వయసును సైతం లెక్కచేయకుండా ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్న మల్లికార్జున ఖర్గే ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు, ఈ వేడుకలలో గార్ల మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ మొహమ్మద్ జరీనా బేగం గోపాలపురం ఉపసర్పంచ్ ఎర్రగడ్డ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జర్పుల పృథ్వీరాజ్ నాయక్ ,భానోత్ మల్లిబాబు, మహమ్మద్ రహీం ఖాన్, కోటేష్, పటాన్ ఇమ్రాన్ ఖాన్, భూక్య అశోక్ నాయక్, కోలా కుమార్ గౌడ్, కత్తుల ప్రశాంత్, ఎల్లంకి సాయికుమార్, పత్తియా నాయక్, అంజనాపురం మత్స్య శాఖ అధ్యక్షులు చిట్టిబాబు, గార్ల, చిన్న బంజర, చిన్న కిష్టాపురం, గోపాలపురం, మర్రిగూడెం, కోట్యానాయక్ తండ బిఆర్ఎన్ తండ వివిధ గ్రామపంచాయతీల వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

