Homeతెలంగాణహనుమకొండఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

గార్ల, పెన్ పవర్, జూలై 25:

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజును పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలో స్థానిక మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర దేవస్థానం ప్రాంగణంలో
శుక్రవారం ఎంపిటిసి శీలంశెట్టి రమేష్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామికి అర్చన పూజలు నిర్వహించారు అనంతరం పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి రమేష్ మాట్లాడుతూ జననేతగా బడుగు బలహీన వర్గాల బాంధవుడిగా పార్టీ శ్రేణుల గుండెల్లో తనకంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకొని చిన్న వయసులోనే పార్టీని నడిపిస్తూ సమర్థ నాయకుడిగా కేటీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేర్చడమే లక్ష్యంగా కేటీఆర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ బానోతు అమర్ చంద్, బుడిగ మురళి, ఖదీర్ బాబా, మోహన్ రావు,శ్రీనివాస్,నాగన్న, ముంగిరాములు,లక్ష్మారెడ్డి, కొండలరావు, సాయి, విజయ్, యాకూబ్, దేవేందర్,శివాజీ, వినోద్,చంటి, బాలాజీ, యాకూబ్ పాషా, మహేష్, వెంకట్, ఉమేష్, నరసింహ, అనిల్, మహేష్, క్రాంతి, చంద్రశేఖర్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular