ఖమ్మం జిల్లాలో దారుణ హత్య
వివాహేతర సంబంధాన్ని చూసినందుకు 15 ఏళ్ల బాలుడి హతం
ఖమ్మం, పెన్ పవర్, నవంబర్ 10 :
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకొరుకొండ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ వివాహేతర సంబంధాన్ని చూశాడనే కారణంతో పదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు రవిని ఓ మహిళ, యువకుడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. భర్తతో విడిపోయిన అపర్ణ అనే మహిళ చిన్నకొరుకొండలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన అజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వారిద్దరూ ఏకాంతంగా ఉండటాన్ని గమనించిన రవి, ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబుతానని హెచ్చరించినట్లు సమాచారం.
దీంతో బాలుడిని అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. గత నెల 24న రవిని గ్రామ శివారుకు తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని కుటుంబ సభ్యులు 25న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రవి మృతిచెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులైన అపర్ణ, అజయ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

