Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంనిరుపేదకు వైద్య సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

నిరుపేదకు వైద్య సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

నిరుపేదకు వైద్య సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం , జూలై 24 : వైద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ నిరుపేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు.

దక్షిణ నియోజకవర్గం 27వ వార్డు అశోక్‌నగర్‌కు చెందిన ఈతలపాక అప్పారావు అనారోగ్యంతో పాటు గతంలో జరిగిన బస్సు ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయాలపాలై కేజీహెచ్‌లో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం ఇంటి వద్ద కోలుకుంటున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించలేకపోతున్నారని వార్డు అధ్యక్షుడు నీలాపు సర్వేశ్వర్ రెడ్డి ద్వారా తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బాధితుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.5,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేసి, భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. కష్టాల్లో ఉన్న వారు సమాచారం అందిస్తే తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.

సకాలంలో ఆర్థిక సహాయం అందించినందుకు బాధిత కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ మేధావి విభాగం సెక్రటరీ ఈతలపాక విజయ్ భాస్కర్, జిల్లా మేధావి విభాగం సెక్రటరీ దాసరి విజయభాస్కర్ రెడ్డి, యలక శివాజీ, పి. మౌలిష్, పి. నవీన్ గంగాధర్, సనపల రవీంద్ర భారత్, ముజీబ్ ఖాన్, సాగర్, భాషా, బేవర మహేష్, సారిక దైవ కుమార్, ఆకుల శ్యామ్, చాపల నూకరాజు, బుర్రలు చిన్న, చింతకాయల వాసుతో పాటు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular