Homeతెలంగాణబస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కి వినతి

బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కి వినతి

 

గార్ల, పెన్ పవర్, జూలై 27:

ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం గార్ల గోపాలపురం రాజు తండా సర్పంచులు పార్వతి హతీరాం నాయక్ సుశీల భారతీ లు మహబూబాబాద్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. గార్ల మండల వ్యాప్తంగా ఉన్న 20 గ్రామ పంచాయతీల ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు రైతులు వృద్ధులు మహిళలు విద్యా వైద్యం ఉపాధి ఇతర అత్యవసర అవసరాల కోసం ఖమ్మం మహబూబాబాద్ పట్టణాలకు వెళ్లేందుకు ప్రతినిత్యం మండల కేంద్రమైన గార్లకు రావడం జరుగుతుందని గ్రామం నుండి బయటకు వెళ్లాల్సి వచ్చిన ప్రతిసారి వెళ్లేందుకు రవాణా సదుపాయం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని మా గ్రామాల మీదుగా ఖమ్మం నుంచి మహబూబాబాద్ మహబూబాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రతినిత్యం ఉదయం 8:30 సాయంత్రం 4:30 వేలల్లో రెండు ట్రిప్పులు వచ్చే విధంగా ప్రభుత్వ బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వస్తే గార్ల మండల గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలపగా డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular