Homeతెలంగాణకోవత్తులతో సిపిఐ నాయకుల నిరసన

కోవత్తులతో సిపిఐ నాయకుల నిరసన

గార్ల, పెన్ పవర్, జులై 27:

నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన 21 మంది విద్యార్థులకు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద సోమవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం పట్ల విద్యార్థుల ఉద్యమం ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పాశవికంగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నీటిని రద్దు చేసి రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని విద్య వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సమితి సభ్యులు కట్టెబోయిన పిచ్చయ్య, భూక్య హరినాయక్, ధారావత్ వీరన్న, లావుడియా బీముడు, బాదం రాజేష్, టి యు ఎఫ్ నాయకులు ధారావత్, బాబురావు, జానీ మియా సేట్ రాం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular