ఖమ్మం రూరల్, పెన్ పవర్, జులై 27:
అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 43వ డివిజన్లో రూ.61. 50 లక్షల సుడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు,సీసీ డ్రైన్లనిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగ పడే ప్రతి అభివృద్ధి పనిని నాణ్యతతో చేపట్టి పదికాలాల పాటు మన్నికగా ఉండే విధంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనుల అమలులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రభుత్వ నిధులను పారదర్శకంగా వినియోగించాలని స్పష్టం చేశారు.అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు కూడా నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే పనులు మరింత నాణ్యతగా పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులనుఎదుర్కొంటున్నప్పటికీ ఖమ్మం నగర అభివృద్ధికి వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పిస్తోందని అన్నారు.ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నగరంలో విశాలమైన రహదారులు, మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని మంత్రి పేర్కొన్నారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న మంత్రి, పరిశుభ్రత వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ 43వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాంపాటి వెంకన్న మాజీ కౌన్సిలర్ కుక్కల గురుమూర్తి దోతుల చైతన్య మహమ్మద్ గౌస్ పాషా దొబ్బల సురేష్ వీరభద్ర నాయక్ భవాని లతా షమీ రఫీ అనంతరాములు వీరయ్య పూర్ణ శంకర్ సురేష్ బాలు శ్రీను భాస్కర్ డిఎం సి ఏ ఎం సి డి ఈ ఏఈ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

