ఆనందపురంలో సిరమ్మకు జగన్ ఆప్యాయ పలకరింపు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 30:
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా గురువారం ఆనందపురం గోకార్డ్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె, “చిన్న శ్రీను సోల్జర్స్” అధ్యక్షురాలు సిరమ్మ జగన్ను కలిసి స్వాగతం పలికారు. జగన్ ఆమెను ఆప్యాయంగా పలకరిస్తూ ఆశీర్వదించారు.
యువ నాయకురాలిగా సిరమ్మ చొరవ, పార్టీ కార్యక్రమాల్లో ఆమె చురుకైన పాత్ర స్థానిక నాయకులు, కార్యకర్తల ప్రశంసలు అందుకుంది. తండ్రి అడుగుజాడల్లో ప్రజా సేవ లక్ష్యంగా ముందుకు సాగుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.
ఆనందపురంలో జరిగిన ఈ భేటీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.

