✒️
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు..
పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
అమరావతి, జూలై 30: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులను రద్దు చేస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరూ పార్టీ తరఫున ప్రెస్మీట్లు నిర్వహించకూడదని, టెలివిజన్ డిబేట్లు లేదా ఇతర మీడియా కార్యక్రమాల్లో జనసేన పార్టీ ప్రతినిధులుగా పాల్గొనరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నూతన రాష్ట్ర అధికార ప్రతినిధుల కమిటీ నియామకం పూర్తైన తర్వాత మాత్రమే అధికారికంగా టీవీ డిబేట్లు, మీడియా సమావేశాల్లో పాల్గొనాలని పవన్ కల్యాణ్ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధికారిక వైఖరిని కొత్త కమిటీ ద్వారానే ప్రజలకు తెలియజేయనున్నట్లు సమాచారం.

