Homeతెలంగాణఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు

ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు

 

గార్ల, పెన్ పవర్, జూలై 30:

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కృతిక రంగాల్లో మత ఉన్మాద భావజలానికి వ్యతిరేకoగా జరిగే ఉద్యమం లో కళాకారులూ గళం తో చేయూతను అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో జరుగుతున్న ప్రజా నాట్య మండలి రాష్ట్ర స్థాయి మూడు రోజుల శిక్షణ తరగతులు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నక్క సైదులు అధ్యక్షతన జరిగిన ముగింపు తరగతులలో శ్రీనివాస్ మాట్లాడారు. ప్రజలు, రైతులు, కార్మికులు, సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల వర్గ ఆలోచన తో కూడిన వర్గ పోరాటాలు నిర్వహిoచడం లో ప్రజా నాట్య మండలి ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు. మతోన్మాద విధానలపై జరపానున్న వర్గ పోరాటాలలో కళాకారులు ప్రధాన అస్రంగా ఉపయోగ పడాలని అన్నారు. దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమాలకు ప్రజానాట్యమండలి అండగా నిలుస్తుందని భవిష్యత్తులోనూ ఈ స్ఫూర్తిని కొనసాగించి, నూతన సంస్కృతిక విప్లవానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, సీనియర్ కళాకారుడు అలవాల రామకృష్ణను శాలువను కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్ర ప్రముఖ గాయకుడు ఏ జగన్,ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఎంజే వినోద్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల ఆనంద్, కాకం ఆంజనేయులు, రాష్ట్ర సహాయ కార్యదర్శిలు కొండూరు భాస్కర్,కుమ్మరి శంకర్,రాష్ట్ర నాయకులు ముత్యాలు,మేడి అంజమ్మ, హరిత, బి.వీరాస్వామి,,మండల నాయకులు సిహెచ్ ఎల్లయ్య, వెంకన్న, ఎస్ నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న,కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి,డోర్నకల్ సిఐటియు మండల కార్యదర్శి దాసరి మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular