Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంఆగస్టు 8 రాష్ట్ర మన్యం బంద్‌ను జయప్రదం చేయండి: గిరిజన సంఘం పిలుపు

ఆగస్టు 8 రాష్ట్ర మన్యం బంద్‌ను జయప్రదం చేయండి: గిరిజన సంఘం పిలుపు

#Hum

ఆగస్టు 8 రాష్ట్ర మన్యం బంద్‌ను జయప్రదం చేయండి: గిరిజన సంఘం పిలుపు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 5: ఆగస్టు 8న నిర్వహించనున్న రాష్ట్ర మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని జగదాంబ సీఐటీయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించాలని, జీవో నంబర్–3కు బదులుగా ప్రత్యామ్నాయ జీవోను ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే 1/70 భూబదలాయింపు నియంత్రణ చట్టాన్ని పరిరక్షించేలా సుప్రీంకోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు.

పాడేరు, ముంచంగిపుట్టు మండలాల్లో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన గిరిజన నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే జీవో నంబర్–3కు ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మన్య ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం కమిటీలు, చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవమైన ఆగస్టు 9లోపు ఆదివాసీ హక్కుల పరిరక్షణపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 8న జరిగే రాష్ట్ర మన్యం బంద్‌లో విద్యార్థులు, యువత, మేధావులు, తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ. అశోక్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కిముడు చిన్నంనాయుడు, జిల్లా కార్యదర్శి జి.వి. రమణమూర్తి, మాజీ అధ్యక్షుడు ఎస్. దామోదర్, సహాయ కార్యదర్శి సి.హెచ్. కోటీబాబు, జిల్లా కమిటీ సభ్యుడు రామారావు తదితరులు పాల్గొని ప్రభుత్వాన్ని తమ డిమాండ్లు వెంటనే అమలు చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular