చీరాల, సెప్టెంబర్ 22 (పెన్ పవర్):
చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చీరాల ఎమ్మెల్యే కొండయ్య హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం చీరాలలో ఎమ్మెల్యేను ఉమ్మడి ప్రకాశం జిల్లాల చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ దామర్ల శ్రీకృష్ణ ఆధ్వర్యంలో చేనేత సంఘాల ప్రతినిధులు కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
నేతన్న సేవ పథకంపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గంలోని పలు చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, చేనేత పెద్దలు పాల్గొన్నారు. నేతన్న సేవ పథకం కింద అర్హత ఉన్నప్పటికీ ఇంకా లబ్ధి పొందని చేనేత కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. చేనేత సహకార సంఘాల సమస్యలతో పాటు ఇతర కార్మిక సమస్యలను కూడా పరిశీలిస్తానని చెప్పారు.
రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు
కీర్తిశేషులు ప్రజాబంధు ప్రగడ కోటయ్య ప్రియ శిష్యులైన దామర్ల శ్రీకృష్ణ ఎమ్మెల్యేకు చేనేత సమస్యలతో కూడిన మెమోరాండం అందజేశారు. త్వరలో చేనేత కార్మికులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, అన్ని సమస్యలను సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మారావు, భూసం శ్రీనివాసరావు, పృథ్వి చంద్రమోహన్, వెంకటేశ్వర్లు, గుత్తి మదన్ మోహన్ రావు, మాచర్ల గౌరీశంకర్, రెబ్బ నరసింహులు, కందుల విజయ్, గోలి మల్లికార్జునరావు, కాటూరి వెంకటేశ్వర్లు, గంజి రామారావు, బుదాటి ప్రసాద్, విన్నకోటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే చేనేత పెద్దలు మునగాల గిరిధర్, గుత్తి శ్రీనివాసరావు, గుద్దంటి సుధాకర్, దామర్ల రాఘవులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, చేనేతల శ్రేయోభిలాషి చుండూరు వాసు తదితరులతో కలిపి సుమారు 40 మంది పాల్గొన్నారు.

