Homeతెలంగాణవదినను వేధించిన మరిది పై కేసు నమోదు

వదినను వేధించిన మరిది పై కేసు నమోదు

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 5:

వదినను వేధిస్తున్న మరిదిపై కేసు నమోదు చేసినట్టు గార్ల ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గార్ల మండల పరిధిలోని చిన్న కిష్టాపురం మంగలి తండా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ తన భర్త చనిపోయిన నాటినుండి మరిది బానోతు వీరన్న తన వేధింపులకు గురి చేస్తున్నారని ఈనెల 2వ తారీఖున రాత్రి 7 గంటల సమయంలో ఎవరూ లేనిది చూసి ఒంటరిగా ఇంట్లో ఉండగా నేను నీకు అండగా ఉంటాను నువ్వు నాకు కావాలి అంటూ వేధింపులకు గురి చేశాడని దీంతో నేను కేకలు వేయడంతో   ఇంట్లో నుండి పారిపోయాడని నన్ను అన్ని విధాలుగా వేధింపులకు గురి చేస్తున్న తన మరిది వీరన్న  పై బాధితురాలు బుధవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular