ఫ్యాకల్టీ చైర్మన్‌గా ఆచార్య ప్రవీణ్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు,06 :
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఫ్యాకల్టీ చైర్మన్‌గా సివిల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు టి.వి ప్రవీణ్ నియమితులయ్యారు. నేడు ఆయనకు వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ కార్యాలయంలో ఉత్తర్వులు అందజేసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రవీణ్‌కు కళాశాల ఆచార్యులు, పలువురు అధికారులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

