Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మావూరి రామారావు మృతి

వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మావూరి రామారావు మృతి

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగష్టు 7:గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ మాజీ వైస్‌ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు మావూరి రామారావు గురువారం రాత్రి 9.55 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.రామారావు మృతి తమ కుటుంబానికి, ఆత్మీయులకు తీరని లోటని కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పేర్కొన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.మావూరి రామారావు భౌతికంగా తమ మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ తమ గుండెల్లో నిలిచిపోతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

👉నేడు అంతిమయాత్ర:

మావూరి రామారావు అంతిమయాత్ర శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పెదవలస గ్రామం నుంచి ప్రారంభం కానుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలకనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular