Homeతెలంగాణగార్లను కరువు మండలంగా ప్రకటించాలి

గార్లను కరువు మండలంగా ప్రకటించాలి

 

గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 21:

వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గార్ల మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఎం నాయకులు సీపీఎం జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి,లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతుల పరిస్థితిపై సమగ్రంగా అంచనా వేయాలని నాయకులు కోరారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని, కరువు మండలంగా ప్రకటించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలిచేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కోరారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో మంగమ్మకు   సమర్పించారు. గార్ల మండల పరిస్థితిని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో సీపీఎం నాయకులు , అంబటి వీరస్వామి, పెద్ద వెంకటేశ్వర్లు, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular