Homeఎడిటోరియల్ట్రాలీ ఢీకొని యువకుడు మృతి

ట్రాలీ ఢీకొని యువకుడు మృతి

ట్రాలీ ఢీకొని యువకుడు మృతి

 

 

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవరయలమంచిలి, ఆగస్టు 8:

యలమంచిలి మండలం పురుషోత్తపురం హైవే వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. యలమంచిలి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం భీమిలికి చెందిన చింతల సాయి (27), రవ్వ సంతోష్ (26), రవ్వ దుర్గారావు (31) విజయవాడలో నివాసం ఉంటూ ప్లంబింగ్ పనులు చేస్తున్నారు.

ప్లంబింగ్ పనుల నిమిత్తం శనివారం విజయవాడ నుంచి రెండు స్కూటీలపై అన్నవరం వెళ్లిన ముగ్గురు, అక్కడ పనులు పూర్తి చేసుకుని భీమిలిలో కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. చింతల సాయి, రవ్వ సంతోష్ కలిసి ఒక స్కూటీపై, రవ్వ దుర్గారావు మరో స్కూటీపై అన్నవరం నుంచి భీమిలి బయలుదేరారు.

సాయంత్రం సుమారు 4.40 గంటల సమయంలో పురుషోత్తపురం హైవే వద్దకు చేరుకున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న ట్రాలీ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న రవ్వ సంతోష్‌కు తీవ్ర గాయాలు కాగా, స్కూటీ నడుపుతున్న చింతల సాయికి కూడా గాయాలయ్యాయి. వెంటనే హైవే అంబులెన్స్‌లో వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవ్వ సంతోష్ మృతి చెందాడు.

ప్రమాదంపై యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular