Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంరాంకీ ల్యాండ్‌ఫిల్ పనులు నిలిపివేయాలి.. తాడి గ్రామాన్ని తరలించాలి

రాంకీ ల్యాండ్‌ఫిల్ పనులు నిలిపివేయాలి.. తాడి గ్రామాన్ని తరలించాలి

రాంకీ ల్యాండ్‌ఫిల్ పనులు నిలిపివేయాలి.. తాడి గ్రామాన్ని తరలించాలి

బ్యూరో రిపోర్ట్  పెన్ పవర్  – విశాఖపట్నం, పరవాడ, ఆగస్టు 13: ఫార్మాసిటీని ఆనుకుని ఉన్న తాడి గ్రామాన్ని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, గ్రామానికి సమీపంలో 116 సర్వే నంబర్‌లో రాంకీ యాజమాన్యం చేపట్టనున్న ల్యాండ్‌ఫిల్ పనులను నిలిపివేయాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గని శెట్టి డిమాండ్ చేశారు.

తాడి కాలనీలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గని శెట్టి మాట్లాడుతూ.. తాడి గ్రామాన్ని ఆనుకుని ఉన్న 116 సర్వే నంబర్‌లో ల్యాండ్‌ఫిల్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్లు 13, 14 ద్వారా అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. దీనివల్ల గ్రామంలో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, కార్పొరేట్ సంస్థకు మాత్రం త్వరితగతిన అనుమతులు ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. తాడి గ్రామాన్ని వెంటనే తరలించాలని, ల్యాండ్‌ఫిల్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ల్యాండ్‌ఫిల్ పనులు ప్రారంభిస్తే పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేపడతామని గని శెట్టి హెచ్చరించారు. కార్యక్రమంలో కే. బాలమ్మ, లక్ష్మి, అప్పల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular