Homeఎడిటోరియల్మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన

మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన

మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్,      పెందుర్తి, ఆగస్టు 13: మాదకద్రవ్యాల వినియోగం, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై పెందుర్తి పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ సూచనల మేరకు సుజాతనగర్‌లోని శ్రీ నవోదయ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎస్‌ఐ విభూషణ్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలను విద్యార్థులకు వివరించారు. యువత చెడు అలవాట్లకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

అదేవిధంగా సోషల్ మీడియా వినియోగం వల్ల ఎదురయ్యే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు.

“మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించండి.. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి” అనే సందేశాన్ని పోలీసులు విద్యార్థులకు అందించారు.

కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యువతను సన్మార్గంలో నడిపిస్తూ మాదకద్రవ్య రహిత సమాజం, సురక్షిత డిజిటల్ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular