Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిహరిద్వార్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు నర్సీపట్నం నింజాస్ అకాడమీ క్రీడాకారులు

హరిద్వార్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు నర్సీపట్నం నింజాస్ అకాడమీ క్రీడాకారులు

నర్సీపట్నం, పెన్ పవర్:

ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న 6వ జాతీయ గ్రాఫ్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలకు నర్సీపట్నం నింజాస్ అకాడమీకి చెందిన 18 మంది క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొననున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు కోచ్‌గా నర్సీపట్నానికి చెందిన వేపాడ ప్రియాంక వ్యవహరించనున్నారు. ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రాఫ్లింగ్ కమిటీ రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జాతీయ పోటీలకు ఎంపిక చేసినట్లు కోచ్ వేపాడ ప్రియాంక తెలిపారు. వేపాడ ప్రియాంక శిక్షణలో నింజాస్ అకాడమీ నుంచి ఒకేసారి 18 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల అకాడమీ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను, కోచ్ ప్రియాంకను నింజాస్ అకాడమీ చైర్మన్ వెలగా నారాయణరావు, జనరల్ సెక్రటరీ, డైరెక్టర్ సుతాపల్లి శ్రీకాంత్, శాప్ కోచ్ అబ్బు, అకాడమీ సభ్యులు, క్రీడాకారుల తల్లిదండ్రులు అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న మూడు శాతం క్రీడా రిజర్వేషన్‌తో పాటు క్రీడాకారులకు ఉద్యోగాలు, ఉన్నత విద్యలో అవకాశాలు, నగదు పురస్కారాలు, ఇతర ప్రోత్సాహకాలు లభిస్తుండటంతో విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెరుగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నర్సీపట్నంలోని అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఆరుగురు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుండటం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌రావు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి నర్సీపట్నం, ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular