రామచంద్రపురం,పెన్ పవర్, ఆగస్టు 28: కూటమి పార్టీ సీనియర్ నాయకులు గుబ్బల యేసురాజు పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రామచంద్రపురంలోని ఆయన స్వగృహంరామచంద్రపురంలో అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు యేసురాజుకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో యేసురాజు కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. రామచంద్రపురం నియోజకవర్గ జనసేన యువ నాయకులు, డీఎన్ఎఫ్ సంస్థ అధినేత డాక్టర్ డేగల నాగేంద్ర యేసురాజుకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆయన ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాజులూరు మండలానికి చెందిన జనసేన సీనియర్ నాయకులు తోట కృష్ణ, వడ్డి శ్రీనివాస్,మాత నాగరాజు,వడ్డాది ధరణి,బుంగా రాజు తదితరులు పాల్గొని యేసురాజుకు శుభాకాంక్షలు తెలిపారు.

