పాడేరు, సెప్టెంబరు 2: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాడేరులో రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపుూరు గంగులయ్య ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అదే సమయంలో పాడేరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ నాయకులు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ జన్మదిన వేళ జనసేనలో భారీ చేరికలు జనసేనలోకి పలువురి క్యూ..
RELATED ARTICLES

