Homeతెలంగాణనల్గొండగట్టుమీది తండాలో ఘనంగా మేరమ్మ తల్లి, సంత్ సేవాలాల్ మహారాజ్ పూజలు

గట్టుమీది తండాలో ఘనంగా మేరమ్మ తల్లి, సంత్ సేవాలాల్ మహారాజ్ పూజలు

హైదరాబాద్, పెన్ పవర్ సెప్టెంబర్ 06:

నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం లోనీ గట్టుమీది తండాలో మేరమ్మ తల్లి దేవతతో పాటు సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ పూజారి రామావత్ మంగ్త నాయక్, గ్రామ సర్పంచ్ రామావత్ సోని శంకర్ నాయక్, గ్రామ పెద్దలు సిల్మా నాయక్, మంగ్త నాయక్, ధన్సింగ్ నాయక్, బిచ్య నాయక్, భద్రి నాయక్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular