గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 8:
ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య జన్మదిన వేడుకలను మంగళవారం గార్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు.తొలుత స్థానిక నెహ్రూ సెంటర్ కూడలిలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం లోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

