గూడెంకొత్తవీధి, పెన్ పవర్ అక్టోబర్ 24: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించిందని, ప్రజలు ఆదరిస్తే గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని గూడెంకొత్తవీధి మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థి వీర వెంకట్, గూడెంకొత్తవీధి–1 ఎంపీటీసీ అభ్యర్థిని రాజేశ్వరి తెలిపారు.శనివారం సాయంత్రం గూడెంకొత్తవీధిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వారు స్థానికులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన ప్రతినిధులు పంచాయతీ, మండల స్థాయిలో ప్రజాప్రతినిధులుగా ఉంటే స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అభివృద్ధి పనుల కోసం కృషి చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తమకు మద్దతు తెలిపి ఆదరించాలని స్థానికులను కోరారు.
ప్రజల ఆదరణతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం! కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజ్ఞప్తి
RELATED ARTICLES

