Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువినాయకుడి చెంతకు మూషికం.. భక్తుల్లో ఆసక్తి

వినాయకుడి చెంతకు మూషికం.. భక్తుల్లో ఆసక్తి

సీలేరు, పెన్ పవర్, సెప్టెంబర్ 15:సీలేరులోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ప్రాంగణంలో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహం వద్ద పూజలు జరుగుతున్న సమయంలోఎలుక (మూషికం) వినాయకుడి పాదాల చెంతకు వచ్చి కొద్దిసేపు నిలబడింది.దీంతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా తిలకించారు. వినాయకుడి వాహనం మూషికం కావడంతోఘటనను అక్కడున్న వారు ప్రత్యేకంగా భావించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేయడంతో పాఠశాలలో పండుగ సందడి మరింత పెరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular