Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుజనసేన సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా

జనసేన సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా

చింతపల్లి, పెన్ పవర్, సెప్టెంబర్ 15:జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న కంచర్ల హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబానికి పార్టీ సభ్యత్వం ద్వారా లభించే ప్రమాద బీమా పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ మేరకు రూ.5 లక్షల చెక్కును పాడేరు జనసేన పార్టీ ఇన్‌చార్జి, రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. హరికృష్ణ కుటుంబానికిసహాయం ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మేరకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉల్లి సీతారాం, గొర్లె వీర వెంకట్, సుర్ల వీరేంద్ర,శ్రీను, రామకృష్ణ కార్యకర్తలు, స్థానికులు, హరికృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular