Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుదామనాపల్లి జనసేన నాయకులతో డాక్టర్ వంపూరి గంగులయ్య భేటీ

దామనాపల్లి జనసేన నాయకులతో డాక్టర్ వంపూరి గంగులయ్య భేటీ

  • గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 15: గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీకి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్, పాడేరు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని గంగులయ్య సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమన్వయంతో పార్టీ కార్యక్రమాలను కొనసాగించాలని పేర్కొన్నారు.గంగులయ్యను కలిసిన వారిలో మాదల సతీష్, సీదరి రమణమూర్తి, సీదరి మత్యరాజు, వంతల వెంకటేశ్వర్లు, వంతల సింగరాజు, సుర్ల గంగరాజు, పాంగి ధారబాబు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular