ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 15:
పార్కింగ్ చేసి ఉన్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని నయరా పెట్రోల్ బంక్ సమీపంలో శ్రీనివాస ట్రావెల్స్ కు చెందిన బస్సును పార్కింగ్ చేసి ఉంచారు. కాగా బస్సులో ఉన్న ఏసీ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సులో మంటలు చెలరేగడానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

