Homeఆంధ్రప్రదేశ్బాపట్లవిధి నిర్వహణలో ఆర్డీఓ హరికుమార్ అప్రమత్తత

విధి నిర్వహణలో ఆర్డీఓ హరికుమార్ అప్రమత్తత

వినాయక నిమజ్జన ఏర్పాట్లను రాత్రివేళ పరిశీలన – సిబ్బందికి కీలక సూచనలు

బాపట్ల, సెప్టెంబర్ 20 (పెన్ పవర్): విధి నిర్వహణే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ ప్రజా భద్రత, సౌకర్యాల కోసం ఆర్డీఓ హరికుమార్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బాపట్ల ప్రాంతంలో జరుగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాల ఏర్పాట్లను ఆదివారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆదర్శనగర్ కాలువ వద్ద ఏర్పాటు చేసిన శామియానాలు, లైట్లు వర్షం కారణంగా పడిపోయిన విషయాన్ని తనిఖీల్లో గుర్తించారు. వెంటనే సిబ్బందిని చరవాణి ద్వారా అప్రమత్తం చేసి, యుద్ధప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అనంతరం సముద్రతీర ప్రాంతానికి చేరుకున్న ఆర్డీఓ హరికుమార్ వినాయక విగ్రహాల నిమజ్జనానికి చేపట్టిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. భక్తుల రాకపోకలు, భద్రత, లైటింగ్ తదితర అంశాలపై సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular