Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుభారీ వర్షాలు.. రేపు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాలు.. రేపు పాఠశాలలకు సెలవు

స్టాఫ్ రిపోర్టర్ పాడేరు, పెన్ పవర్, సెప్టెంబర్ 24:భారీ వర్షాలు, వరదలు, కొండచరియల ముప్పు నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా సెప్టెంబర్ 25న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు.రెసిడెన్షియల్ పాఠశాలలకుసెలవు వర్తించదని స్పష్టం చేశారు. అక్కడ విద్యార్థుల భద్రత, పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular