వేటపాలెం, అక్టోబరు 3 : హజరత్ మహెబూబె సుభానీ, ఖంధిలె నూరానీ, పిరానె పీర్ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ సర్కార్ వారి గ్యార్వి షరీఫ్ పండుగను మాబు సుభానీ వారియర్స్ యూత్ ఆధ్వర్యంలో వేటపాలెం మండలం ఆబాద్నగర్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లంగర్ అన్నసమారాధన చేపట్టారు. గులామె మష్కురో యూసుఫ్ సుభానీ అల్ మష్కురి పాల్గొని సలాం ఫాతెహ నిర్వహించి ప్రత్యేక దువా చేశారు. కార్యక్రమంలో మొగల్ అన్వర్ బేగ్, షఫీ రహమతుల్లా, ఫకర్ మహ్మద్, మౌలానా బేగ్, జిలానీ బేగ్, బాబు, రఫీఖాన్, మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ మాబు ఖాదర్ ఖాన్, బాజీఖాన్ ఖాదర్, రసూల్ ఖాన్, ఖాజా ఆరిఫ్, జునైద్ మష్కురి తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

